DEO GUNTUR

Friday, 14 August 2026

Academic instructors in Govt/ZPP/MPP/Municipality and Municipal Corporation Schools in the state for a period of Eight(8) months

 Mandal Wise Academic Instructors Details::



Download School Wise Academic Instructors 


Download Application


ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ మరియు మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల యందు 2026-2027 విద్యా సంవత్సరమునకు అకడమిక్ ఇన్‌స్పెక్టర్లను నియమించుటకు విధి విధానములు జారీచేయబడినవి. అకడమిక్ ఇన్‌స్పెక్టర్ (స్కూల్ అసిస్టెంట్) నెలకు రూ.12,500/- చొప్పున గౌరవ వేతనం ఇవ్వబడును. గుంటూరు జిల్లా నందు 92 మంది స్కూల్ అసిస్టెంట్లను అకడమిక్ ఇన్‌స్పెక్టర్ నియామకం కొరకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు www.deognt.blogspot.com వెబ్‌సైట్ నందు పొందుపరిచిన దరఖాస్తును download చేసి, భర్తీ చేసి అన్ని అర్హత ధృవ పత్రములతో సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు తేది 21-08-2026 లోపు సమర్పించవలెనని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కోరడమైనది. 

పాఠశాల వారిగా మరియు మండల వారిగా ఖాళీ వివరాలు పై తెలిపిన వెబ్‌సైట్ నందు చూడగలరు. కావున ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అకడమిక్ ఇన్‌స్పెక్టర్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది. గడువు తేదీ తర్వాత సమర్పించబడిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలియజేయడమైనది.


జిల్లా విద్యాశాఖాధికారి,

 గుంటూరు