All _ Municipal Management Seniority Lists
All _ MP/ZP Management Seniority Lists
All _Mpl Corporation Management Seniority Lists
All _Govt Management Seniority Lists
ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ప్రచురణ మరియు అభ్యంతరాలు స్వీకరణ
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపాలిటీలు & మున్సిపల్ కార్పొరేషన్ కింద పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితా ను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (TIS) ఆధారంగా రూపొందించాం. ఈ జాబితాలు జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో మరియు నోటీసు బోర్డులలో అందుబాటులో ఉన్నాయి.
* అభ్యంతరాలు స్వీకరణ
సీనియారిటీ జాబితా పై ఎవరైనా అభ్యంతరాలు కలిగి ఉంటే, తేదీ: 10.03.2025 లోపు] వాటిని సంబంధిత జిల్లా విద్యాశాఖ/ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, గుంటూరు, పాఠశాల విద్యాశాఖ కార్యాలయం కు సమర్పించవచ్చు.
అభ్యంతరాల సమర్పణకు అవసరమైన వివరాలు
' అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు / సీనియారిటీ జాబితా లో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఆ ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు (ఉండినట్లయితే) జత చేయాలి.
* గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోనబడవు.
ఫిర్యాదుల పరిష్కార కమిటీ అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులు/ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు సంబంధిత జిల్లా విద్యాశాఖ/జోనల్ విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.