DEO GUNTUR

Friday, 6 November 2026

Seniority Lists of MEOs and Head Masters of Govt., ZP, Municipal and Municipal Corporation Managements.

 


1)  Govt. MEOs - Guntur Zone


2)  Govt. Head Masters - Guntur Zone


3)  ZP MEO-I


4) ZP MEO-II


5) ZP Gr. II HMs


6) Mpl. Head Masters


7) Mpl. Corporation Head Masters.


8) D.I.E.T. Lecturers.


                                             ******

                                      పత్రికా ప్రకటన

                                    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్ - 2025 ప్రకారం పాఠశాల విద్యాశాఖలోని గ్రేడ్-II ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు (MEOలు), DIET సీనియర్ లెక్చరర్లు మరియు లెక్చరర్ల ముసాయిదా సీనియారిటీ జాబితాలను ప్రభుత్వం విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు తెలిపారు. 

                                    గుంటూరు జిల్లాకు సంబంధించిన ముసాయిదా సీనియారిటీ జాబితాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయ వెబ్‌సైట్  లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

                                   సంబంధిత ఉద్యోగులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉన్నచో 09-11-2026 సాయంత్రం 5.00 గంటలలోపు తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు.


అభ్యంతరాలు సమర్పించు విధానం:

• అభ్యంతరం లేదా సవరణకు సంబంధించిన పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా పేర్కొనాలి.

• సంబంధిత ధృవపత్రాలు, సేవా రికార్డులు మరియు ఇతర ఆధార పత్రాల ప్రతులను జతపరచాలి.

• ప్రధానోపాధ్యాయులు, MEOలు మరియు DIET అధ్యాపకులు తమ అభ్యంతరాలను Proper Channel ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించాలి.

• గడువు అనంతరం అందే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోబడవు.

నిర్దేశిత గడువులోగా ఎటువంటి అభ్యంతరాలు అందనట్లయితే, అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా ముసాయిదా సీనియారిటీ జాబితాలు ఖరారు చేయబడతాయని తెలిపారు. 

 ____  జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు.